వారికోసం ఆ సన్నివేశాల్లో నటించాలని అనుకున్నాను :: సన్నీలియోన్
ఇటీవలి ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ పాత రోజుల్ని గుర్తు చేసుకుంది. తాను అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అత్యుత్తమ కంపెనీలతో పనిచేశానని, ఉదాహారణగా వాటిని హిందీ చిత్ర పరిశ్రమలోని రెండు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలైన కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్‌తో పోల్చింది. ఈ రెండూ తనను బాలీవుడ్లో ఎంతగానో ఆదరించాయని సన్నీ తెలిపింది.'ఒక శృంగార తారగా ఎంతో కష్టపడి పనిచేశాను. నన్ను నియమించుకున్న కంపెనీలు వారు కోరుకున్నవి నా నుంచి పొందారు. కానీ నాకు ఎలాంటి ప్రయోజనం పొందలేదు. నాకు అప్పట్లోనే కోట్లాదిమంది అభిమానులు ఉండేవారు. వారి కోసం అయినా శృంగార సన్నివేశాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో ఆర్థికంగా కూడా చెప్పుకోతగిన స్థాయిలో లేను. కానీ ఇండియాలో బిగ్‌బాస్ సీజన్లో అడుగుపెట్టిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఇక్కడ నాకు అడల్ట్ సీన్లు చేస్తారా..? అని ఎవరూ అడగలేదు. అన్నీ మంచి అవకాశాలే వచ్చాయి.
దాంతో వాటికి గుడ్‌బై చెప్పేశాను. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా. పలు సినిమాల ద్వారా మంచి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది. కానీ బాలీవుడ్లో స్టార్ హీరోలు నాతో నటించేందుకు ముందుకు రాలేదు. తొలిసారి షారుఖ్ సరసన ఐటెం సాంగ్‌లో అవకాశం దక్కింది.' అని చెప్పుకొచ్చింది.ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేసిన సన్నీ
ఫ్రాన్స్‌లో జరిగిన 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో సన్నీ లియోన్ మెరిసింది . అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కెన్నెడీ'. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది యూనిట్. 'కెన్నెడీ' పూర్తయిన తర్వాత వీక్షకుల నుంచి ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ చిత్ర యూనిట్‌కు ఇచ్చారు. ఇక కాన్స్ రెడ్ కార్పెట్‌పై సన్నీ లియోన్ నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ''కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేయడం చాలా గౌరవంగా ఉంది'' అన్నారు సన్నీ లియోన్ . ఈ ఏడాది చివర్లో ఇండియాలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.