బేబీ చిత్రానికి సాయి రాజేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....!!
7 కోట్ల 40 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం రెండు రోజుల్లోనే 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నేడు ఆదివారం కావడం తో ఈ సినిమాకి మార్నింగ్ షోస్ నుండి ప్రతీ చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే ఈ చిత్రానికి మూడవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలా మూడు రోజుల్లోనే ఈ సినిమా పది కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టబోతుంది అట. ఇకపోతే ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించిన సాయి రాజేష్ కి నిర్మాత SKN ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి అయిన వెంటనే రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చాడట.
అంతే కాదు ప్రాఫిట్స్ లో వాటా కూడా ఇస్తానని మాట ఇచ్చాడట. ప్రస్తుతానికి మూడు రోజులకు 3 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 20 కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక నిజమైతే సాయి రాజేష్ కి రెమ్యూనరేషన్ రూపం లో నాలుగు కోట్ల రూపాయలకు పైగానే వచ్చే అవకాశం ఉంది. నిర్మాత SKN కి కూడా ఇది జాక్పాట్ లాంటి సినిమా అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్య వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అనే చెప్పాలి. నటనకి పురః స్థాయి ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించింది, మరో పక్క అందం లోను కుర్రకారుల మనసుల్ని దోచేసింది. రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన చాలా మంది హీరోయిన్స్ కంటే ఈ తెలంగాణ పిల్ల బెటర్, చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో ఈమె జోరు ఎలా ఉంటుంది అనేది.