కొరియో గ్రాఫర్ గా ... డైరెక్టర్ గా ... నటుడిగా తనకంటూ సూపర్ క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లారెన్స్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు కొరియో గ్రాఫర్ గా వ్యవహరించి అద్భుతమైన డ్యాన్స్ మాస్టర్ గా పేరు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ... ఎన్నో సినిమాల్లో నటించి నటుడి గాను ... ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అద్భుతమైన దర్శకుడి గాను మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా లారెన్స్ "రుద్రుడు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ మూవీ ఒకే సారి తమిళ మరియు తెలుగు భాషల్లో విడుదల అయింది. పరవాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో కాస్త విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను వచ్చే ఆదివారం జూలై 23 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్లు తాజాగా జెమినీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
మరి వెండి తెర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇకపోతే లారెన్స్ ప్రస్తుతం చంద్రముఖి 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో థియేటర్ లలో విడుదల చేయనున్నారు.