ఆ కారణంగానే వాళ్లిదరిని పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్...!!
అయితే ఈ వీడియో లో మోహన్ బాబు ,ఆలీ కనిపించకపోవడం తో ఇప్పుడు ఇండస్ట్రీ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది .పవన్ కళ్యాణ్ కావాలని వీరిద్దరిని వీడియోలు ప్రాధాన్యత ఇవ్వలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తనతో పని చేసిన చిన్న నటులకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన పవన్ కళ్యాణ్ మోహన్ బాబు ,ఆలీ కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ వైసీపీ పార్టీ కి చెందినవారు కావడం తో వీరి మద్దతు తనకు రాదని తెలిసి పోస్ట్ చేయలేదంటూ పలువురు నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సినీ సెలబ్రిటీలు అందరినీ కూడా పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాల పరంగా వాడుకోవాలని చూస్తున్నారంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఈ వీడియో ద్వారా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి కూడా కొన్ని స్టిల్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. పవన్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నాయి. మరి ఈ చిత్రాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి మరి.