దానిపై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో...!!
అయితే తాను రాజకీయాలలోకి రాబోతున్నానంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై అభిషేక్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా తాను రాజకీయాలలోకి రాబోతున్నాను అంటూ వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా కేవలం అవాస్తవం అని తెలిపారు.ఈ విధమైనటువంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తనకు చాలా ఆశ్చర్యం కలుగుతుందని తన రాజకీయ ఎంట్రీ గురించి అభిషేక్ బచ్చన్ స్పందించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక అభిషేక్ బచ్చన్ ఇదివరకే తన గురించి ఎలాంటి రూమర్స్ వచ్చిన వెంటనే వాటిని ఖండిస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో అభిషేక్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించినటువంటి అభిషేక్ తనకు రెండో పెళ్లి కూడా మీరే చేయాలి అంటూ ఘాటుగా తన విడాకుల వార్తలకు చెక్ పెట్టారు.