"ఖుషి" మూవీ "ఆరాధ్య" సాంగ్ కు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నర్వాన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా రోజుల క్రితం ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొత్తం పూర్తి అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా కూడా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఈ మూవీ బృందం మరి కొన్ని రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నట్లు ... చాలా స్పీడ్ గానే ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఈ మూవీ మేకర్స్ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
 


ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం మొదటి సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాటకు సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి "ఆరాధ్య" అంటూ సాగే రెండవ పాటను కూడా విడుదల చేసింది. ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.


ఇది ఇలా ఉంటే ఆరాధ్య సాంగ్ విడుదల అయ్యి కొన్ని రోజులే అవుతున్న ఇప్పటికే ఈ సాంగ్ 20 ప్లేస్ మిలియన్ వ్యూస్ ను సాధించుకొని యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ వన్ లో కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ కి హాసన్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: