శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మా విరన్ అనే తమిళ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తాజాగా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా తాజాగా విడుదల చేశారు. తమిళ్ లో మా వీరన్ అనే పేరుతో విడుదల చేసిన ఈ మూవీ తెలుగు లో మహా వీరుడు అనే టైటిల్ తో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాకు ప్రస్తుతం తమిళ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.65 కోట్ల షేర్ ... 11.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.40 కోట్ల షేర్ ... 13.27 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 9.10 కోట్ల షేర్ ... 18.74 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 21.15 కోట్ల షేర్ ... 43.61 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ కి 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 58 కోట్ల టార్గెట్ టి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఈ సినిమా హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 23.85 కోట్ల కలక్షన్ లను రాబట్టవలసి ఉంది.
ప్రస్తుతం ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి.