"బ్రో" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన క్రేజీ న్యూస్..?

Pulgam Srinivas
ఈ నెల తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ విడుదలకు రెడీ గా ఉన్న సినిమా బ్రో. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా నటించగా ... మోస్ట్ టాలెంటెడ్ నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి సముద్ర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ వినోదయ సీతం అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది ఈ మూవీ ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ రీమిక్ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా స్టోరీ ... స్క్రీన్ ప్లే లో అనేక మార్పులను ... చేర్పులను చేసి ఈ మూవీ ని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ లో సాయి తేజ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి కేతిక శర్మ హీరోయిన్ గా కనిపించనుండగా ... ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని జులై 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం ఈ నెల 25 వ తేదీన శిల్పకళా వేదికలో "బ్రో" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ... ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించిన ఏలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం రెండు పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: