తన సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను సెలెక్ట్ చేసిన రాంచరణ్...!!

murali krishna
టాలీవుడ్‌ లో ప్రస్తుతం వరుస సినిమా లతో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ శ్రీ లీల. ఈ అమ్మడు పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయింది.మొదటి సినిమా తోనే ఆమెకు నిరాశ తప్పలేదు. అయినా కూడా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమా లో హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ముద్దుగుమ్మ యొక్క క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది అనే విషయం తెల్సిందే. ప్రస్తుతం మహేష్ బాబు.

పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు పలు స్టార్‌ హీరోల సినిమా లు యంగ్‌ స్టార్ హీరోల సినిమా లు చేస్తూ బిజీగా ఉంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం. అందుకే ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ అమ్మడికి మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌ హీరోగా నటించే అవకాశం దక్కిందట.ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా లో రామ్‌ చరణ్ నటిస్తున్నాడు.శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా విడుదల కాకుండానే బుచ్చి బాబు దర్శకత్వం లో ఒక సినిమా ను ఈ స్టార్‌ హీరో చేయబోతున్నాడు. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనకు తగ్గట్లుగా సినిమా ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మొదట ఈ సినిమా లో బుచ్చి బాబు బాలీవుడ్‌ హీరోయిన్ ను తీసుకోవాలని ఆశ పడ్డాడు. కానీ యూనిట్‌ సభ్యులు కొందరు ఇంకా రామ్ చరణ్ అంతా కూడా సినిమా కి శ్రీ లీల అయితేనే బాగుంటుందని అన్నారట. దాంతో చేసది లేక శ్రీ లీలను చరణ్ కు జోడీగా నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: