ట్రోల్ పై రియాక్షన్ ఇచ్చిన మెగా మేనల్లుడు..!!

Divya
సాయి ధరంతేజ్ ఇటీవలే విరూపాక్ష చిత్రం తో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంతో సాగుతున్న ఈ సినిమా తమిళ హిట్ సినిమా వినోదయ సితం రీమిక్కుగా తెలుగులో బ్రోగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.

ఈ చిత్రం నుంచి మై డియర్ మార్కండేయ, జానవులే అనే రెండు సాంగ్స్ విడుదల చేయడం జరిగింది. మై డియర్ మార్కండేయ అనే పాటలు పవన్ తేజ్ కాంబినేషన్లో ఉండగా జానవులే పాట కేతికాశర్మ, తేజ్ సాగుతుంది. సాయి ధరంతేజ్ డాన్స్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల రూల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా వీటి పైన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. సాయి ధరంతేజ్ గతంలో బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే.

ఆ ప్రమాదం నుంచి తేజ్ ఇంకా రికవరీ కాలేదట.సాయి ధరం తేజ్ మాట్లాడుతూ అసలు నిలబడలేని పొజిషన్ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాను తన బాడికి తగ్గట్టుగా నేను పని చేయాలి కానీ మనకి తగ్గట్టుగా బాడీ సహకరించదు కదా.. విరుపాక్ష  సినిమా సమయం లో నాకు నోటి నుంచి మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు కానీ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాను డాన్స్ విషయంలో నాకు కొంత సమయం కావాలి అంటూ తెలిపారు. దీంతో సాయి ధరమ్ కి మరొక సర్జరీ చేయవలసి ఉందంటూ దీంతో ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాయి ధరంతేజ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: