అలాంటి పని చేయడానికి నాకు ఎటువంటి భయం లేదు..కృతి సనన్..!?

Anilkumar
దీపికా పదుకొనే ప్రస్తుతం తన రూట్ మార్చింది. ప్రస్తుతం ఆమె యాక్షన్ జానర్ వైపు వెళుతుంటే ఇక్కడ కృతి సనన్ మాత్రం చాలా డిఫరెంట్గా పాత రూట్ లో వెళ్తుందని చెప్పొచ్చు. గ్లామర్ ఇమేజ్ కామన్ అయినప్పటికీ కృతి మాత్రం ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రూల్స్ కోసం ఎదురుచూస్తోంది. మంచి పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా స్టార్ హీరోయిన్గా ఎదగొచ్చు అని ఆలోచిస్తోంది కృతి. అలా కెరియర్ ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ల లిస్ట్ లో పేరు తెచ్చుకుంది కృతి. మీ మీ సక్సెస్ తరువాత తన అందం అభినయం తో 

ఉన్న క్రేజీ కాంబినేషన్ అన్న పేరు తెచ్చుకోవడంతో టాప్ స్టార్స్ సైతం ఈమెతో జతకడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో కూడా పేరు సంపాదించుకుంది కృతి సనన్  అయితే మీమీ తర్వాత ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇటీవల అదిపురుష్ సినిమాలో సీత పాత్రలో బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాలకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు డిఫరెంట్ రూల్స్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఆ మధ్య భేడియా సినిమాలో గ్లామర్ షోకు దూరంగా షార్ట్ హెయిర్ లో కనిపించింది కృతి. అయితే ఈ లుక్ విషయంలోనే ఆమెకి కాస్త నెగిటివ్గా కామెంట్స్ వచ్చినప్పటికీ ఆ విషయాలను ఏమాత్రం పట్టించుకోలేదు కృతి సనన్. అంతేకాదు నెగిటివ్ కామెంట్స్ ను ఆమె చాలా పాజిటివ్ గా తీసుకుంటుంది. గ్లామర్ లుక్ లో కనిపించేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం కాని భయం కానీ లేదంటూ ఈ సందర్భంగా పేర్కొంది కృతి సనన్. అయితే కథ నచ్చిన క్యారెక్టర్ డిమాండ్ చేస్తే డి గ్లామర్ లుక్ లో కనిపించేందుకు కూడా నేను రెడీగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా పేర్కొంది కృతి సనన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: