సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు మంచి మంచి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజశేఖర్. ఇక రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. టాలీవుడ్ దంపతులుగా జీవిత రాజశేఖర్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఈ దంపతులకి జైలు శిక్ష విధించింది. కోర్టు మేరకు నాంపల్లి కోర్టు 18వ అదనపు చీఫ్ మెట్రో పోలిటన్ మెజిస్ట్రేట్ సాయి సుధా మంగళవారం సంచలన నిర్ణయం వెల్లడించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద గతంలో తప్పుడు
ఆరోపణలు చేశారు ఈ జీవిత రాజశేఖర్ దంపతులు. అందుకుగాను ఆ గీసుకో ఇప్పుడు తీర్పు వచ్చింది. ఇక అసలు ఏమైంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే 2011లో మీడియా ముందు జీవితాలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారు అని ఈ దంపతులు ఆరోపించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళు అల్లు అరవింద్ వారిద్దరిపై అప్పట్లో కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇక కేసు వేసిన అల్లు అరవింద్ చిరంజీవి నడుపుతున్న సేవా కేంద్రంపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఆయన
చాలా సీరియస్గా తీసుకున్నారు.. అంతేకాదు అప్పట్లో వీరిద్దరూ మీడియాతో మాట్లాడిన వీడియో రికార్డులను సహాయం జత చేసి కోర్టులో సమర్పించడం జరిగింది. ఇక సుదీర్ఘ విచారణ తరువాత మంగళవారం తీర్పు వెల్లడించింది రెండేళ్ల జైలు శిక్షతోపాటు 5000 జరిమానా సైతం విధించింది. ఇక జరిమానా చెల్లించడంతోపాటు తీర్పు పై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో హైకోర్టులో అప్పీలకు అవకాశం ఇస్తూ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం జీవిత రాజశేఖర్ కి జైలు శిక్ష పడడంతో ఈ వార్త కాస్త ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..!!