సితార జ్యువెలరీ యాడ్ చూశారా?.. అచ్చం మహారాణిలా మెరిసిపోతోంది..!

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో సితార కి భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది  ఫోటోలు, డాన్స్ వీడియోలతో సితార సోషల్ మీడియాలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మరి కొద్ది సంవత్సరాల్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సితార ఇటీవల PMJ అనే ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆ జ్యువెలరీ బ్రాండ్ కి సంబంధించి సితార ఫోటోలు కూడా బయటికి వచ్చి సోషల్ మీడియాలో నెటిజెన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఆ ఫోటోలను ఏకంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్స్ పై ప్రమోషన్ చేశారు. 

చిన్న వయసులోనే సితార ఫోటోలు న్యూయార్క్ టైం స్క్వేర్స్ పై రావడం ఓ అరుదైన ఘనత అనే చెప్పాలి. PMJ జువెలరీస్ అనే బ్రాండ్ కి సంబంధించి సితార రీసెంట్ గా ఓ కమర్షియల్ యాడ్ లో కూడా నటించింది. తాజాగా ఆ యాడ్ కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో సితార తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది  ఇక ఈ యాడ్ వీడియోని మహేష్ బాబు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాన్స్ తో పంచుకున్నారు. ఇక ఈ యాడ్ విషయానికొస్తే.. అమెరికా నుంచి తన ఓణీల ఫంక్షన్ కోసం సితార తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వస్తుంది. అప్పుడు అమ్మమ్మ సితారని నేను ఒక చోటికి తీసుకెళ్తాను. 
అక్కడ వాళ్ళు నిన్ను ప్రిన్సెస్ లా చూసుకుంటారు అని చెబుతూ PMJ జ్యువెలర్స్ కి తీసుకెళ్తుంది. 

అక్కడ నగలను చూపిస్తే 'అమ్మమ్మ ఇదంతా అవసరమా?' అని సితార అంటుంది. ఆ తర్వాత షాప్ అతను ఒకసారి అక్కడికి వెళ్లి చూడు ఏముందో అని చెప్పడంతో సితార షాప్ లోనికి వెళ్తుంది. వెళ్ళగానే PMJ జ్యువెలర్స్ ధరించి తనకి తాను ఓ క్వీన్ లా కనిపించినట్టు ఎంతో క్రియేటివిటీగా యాడ్ ని డిజైన్ చేశారు. ఇక PMJ జువెలర్స్ లో సితార తనని తాను చూసుకుని ఎంతో మురిసిపోతుంది. దీంతో ఆ జువెలరీ తోనే తన ఓణీల ఫంక్షన్ చేసుకుంటుంది. ఈ యాడ్లో సితార క్యూట్ స్మైల్ అదిరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా జువెలరీ అంతా ధరించి కనిపించిన ఓ షాట్ లో అయితే అచ్చం మహారాణిలా మెరిసిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: