సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం పెద్దన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించగా ... నయన తార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాలో రజనీ కి సిస్టర్ గా కీర్తి సురేష్ నటించగా ... ఈ మూవీ లో మీనా ... కుష్బూ కీలక పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా రజిని "జైలర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా రజనీ కాంత్ "లాల్ సలాం" అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే రజిని మరి కొంత కాలంలో తమిళ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే వీరిద్దరీ కాంబో లో తెరకెక్కబోయే మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం మార్చి నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లోకేష్ ... తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న లియో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు.