వ్యూహాలు మార్చుకున్న బ్రో !
దీనితో టాప్ హీరోల సినిమాలకు అత్యంత భారీ ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. దీనికితోడు టాప్ హీరోల మధ్య తమ సినిమాలకు సంబంధించి ఓపెనింగ్స్ మధ్య పోటీ చాల ఎక్కువగా ఉంటోంది. అయితే తన సినిమాల కలక్షన్స్ గురించి అదేవిధంగా రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ సూచనతో ఈమూవీ నిర్మాతలు తమ సినిమాకు సంబంధించి ఎడిషినల్ షోలు వేయడం కానీ అదేవిధంగా మొదటి మూడురోజులు టిక్కెట్ ధర పెంచడం కానీ చేయకూడదని నిశ్చయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇలా ఈమూవీ నిర్మాతలు వ్యవహరించడం వెనుక ఒక ఆసక్తికర కారణం వినిపిస్తోంది. తమ మూవీ బడ్జెట్ మరీ అదుపు తప్పకుండా పరిమితులకు లోబడి ఉండటంతో అనవసరంగా టిక్కెట్ల రేట్లు పెంచి ప్రేక్షకులకు అసౌకర్యం కలిగించకూడదని నిశ్చయించుకున్నట్లుగా నిర్మాతల నుండి లీకులు వస్తున్నాయి. అయితే ఈవిషయం పై మరొకవిధ్యమైన వాదన కూడ వినిపిస్తోంది.
‘బ్రో’ మూవీ పై ఇప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మ్యానియా ఏర్పడక పోవడంతో చాల ముందు చూపుతో ఈమూవీ నిర్మాతలు ‘బ్రో’ టిక్కెట్ల రేట్ల పెంపు విషయాయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నారు అన్నమాటలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ పాత్రకు త్రివిక్రమ్ వ్రాసిన డైలాగ్స్ లో మాటల మాంత్రికుడు మ్యాజిక్ కనిపించలేదు అని వస్తున్న కామెంట్స్ రీత్యా కూడ ఈమూవీ టిక్కెట్ల ధర పెంచి ఉండకపోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ‘బ్రో’ విడుదల సమయంలో ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది అనుకోవాలి..