హాట్ టాపిక్ గా మారిన అలియా భట్ తెలివితేటలు !
మంచి నటిగా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడ రాణించాలని అలియా కు ఆలోచన ఉండటంతో 2020 ప్రాంతాలలో ఈమె ఒక చిన్న స్టార్ట్ అప్ కంపెనీ పెట్టింది. చిన్న పిల్లలకు గార్మెంట్స్ తక్కువ ధరలో డిజైన్ చేసి ఇవ్వగల ఒక గార్మెంట్ కంపెనీని ఈమె స్థాపించింది. చిన్నపిల్లల డ్రెస్ ల విషయంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక చిన్న డిజైనింగ్ గార్మెంట్ కంపెనీ ఈమె స్థాపించింది.
ఈమె చిన్నపిల్లల కోసం డిజైన్ చేయించిన డ్రెసెస్ చాల అందుబాటు ధరలలో ఉండటమే కాకుండా మంచి డిజైనింగ్ తో ఆమె చేయించిన కిడ్స్ డ్రెసెస్ కు మంచిపేరు రావడంతో రిలియన్స్ కు సంబంధించిన వర్గాలు అలియా వద్దకు వెళ్ళి ఆమె డిజైన్ చేసిన కొన్ని కిడ్స్ గార్మెంట్స్ చూసిన రిలయన్స్ యాజమాన్యం ఆమె కంపెనీని టోటల్ టేకోవర్ చేసి దానికి ప్రతి ఫలంగా అలియా కు 350 కోట్లు ఇవ్వడానికి కంపెనీ ప్రతినిధులు అలియాతో ప్రస్తుతం రాయబరాలు జరుపుతున్నట్లు టాక్.
అయితే ఈఆఫర్ కు అలియా వెంటనే ఓకె చెప్పకుండా తనకు కొంత సమయం కావాలి అని అడిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు రిలయన్స్ తన కంపెనీని తీసుకున్నప్పటికీ తాను తన సంస్థను రిలయన్స్ కు అప్పచెప్పే విషయంలో అలియాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో టాప్ హీరోలు చేయలేని వ్యాపారాలు అలియా చేశవండి అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హడావిడి చేస్తున్నారు..