పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ప్రాజెక్ట్ K'. 'మహానటి' మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్టర్ కావడం, ఇంకా గత కొన్నేళ్లుగా ఈ సినిమా సెట్స్ మీద ఉండటంతో అంచనాలు చాలా గట్టిగా ఉన్నాయి.కానీ బుధవారం నాడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో అవన్నీ కూడా దెబ్బకు తారుమారు అయ్యాయి అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ లుక్‌పై సోషల్ మీడియాలో చాలా ఘోరంగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.ఈ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ అచ్చం ఐరన్ మ్యాన్ పోజులో కనిపించాడు. అది ఓకే గానీ ఆ తల వేరే ఎవరో బాడీకో అతికించినట్లు ఉందని స్వయానా ప్రభాస్ అభిమానులే ఎంతగానో నిరుత్సాహపడ్డారు.ఇదేదో ఫ్యాన్ మేడ్ పోస్టర్ లాగా అనిపించిందని నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేశారు.అయితే ఈ ట్రోల్స్ అన్నీ కూడా మేకర్స్ దృష్టిలో పడినట్లున్నాయి. దీంతో అధికారికంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియా ఖాతాల నుంచి మేకర్స్ డిలీట్ చేశారు.అయితే ఇలా డిలీట్ చేసిన ఫస్ట్ లుక్ బదులు ఎలాంటి గ్రాఫిక్స్, పేర్లు లేకుండా ఉన్న అదే పోస్టర్ని కొంచెం చేంజ్ చేసి పోస్ట్ చేశారు. అదిప్పుడు పరవాలేదు అనిపిస్తుంది.
కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అందువల్ల ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా కోప్పడుతున్నారు. ఎందుకంటే ఆదిపురుష్ నుంచి ప్రభాస్ పై చాలా ఘోరాతి ఘోరంగా ట్రోల్ జరగడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ విసుగెత్తి పోయారు. కానీ సలార్ టీజర్ మళ్ళీ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచింది. కానీ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రాజెక్ట్ k టీం మాత్రం ఇలాంటి చెత్త గ్రాఫిక్స్ చేసి మనిపోతున్న పాత గాయాన్ని మళ్ళీ గిల్లి ఎక్కువ చేస్తుంది.ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రోలింగ్ ఎక్కువ కాకుడదనే ఉద్దేశంతోనే ఇలా మూవీ టీం డిలీట్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది. మేకర్స్ తీసేసినా సరే ఆ ఫొటో ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా అందుబాటులోనే ఉంటుంది. ఈ జాగ్రత్త ఏదో ముందు ఉంటే బాగుండేదని అంత ఒళ్ళు బద్ధకం ఎందుకని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.ఇక 'ప్రాజెక్ట్ K'లో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ ఇంకా కమల్ హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.