శంకర్ తో బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న చిరు?

Purushottham Vinay
సినీ పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాని అనుకోకుండా మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం సర్వ సాధారణం. ఇక మరికొన్ని సార్లు అయితే ఓ స్టార్ హీరో ఖాతాలో పడాల్సిన డిజాస్టర్.వేరే హీరోకి పడుతుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. అలా తెలుగు సినీ పరిశ్రమలో ఓ స్టార్ హీరో చేయాల్సిన మూవీ మరో హీరోకు అతి పెద్ద భారీ విజయాన్ని అందించింది. ఇంతకీ ఆ హీరో ఎవరు ?.ఏ మూవీ అనేది తెలుసుకుందాం.యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అంటే మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకున్నారు. ఫ్యామిలీ అడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో ఖచ్చితంగా అర్జున్ కూడా ఒకరు. ఇక ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతగానో మెప్పించారు. అందులో ఒకే ఒక్కడు సినిమా తన కెరీర్ లో పెద్ద మైలురాయిగా నిలిచింది.



తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీకి ముందుగా అనుకున్నది హీరో అర్జున్ కాదట. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో ఈ మూవీని చేయాలనుకున్నారట డైరెక్టర్ శంకర్. అయితే ఇదే విషయాన్ని చిరంజీవితో శంకర్ చెప్పగా.. ఆ ప్రాజెక్ట్ చేసేందుకు మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.కానీ ఆ తర్వాత ఈ ప్రారంభించే సమయంలో చిరంజీవి వరుస లతో బిజీగా ఉండడం ఇంకా డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. దీంతో చిరంజీవి స్థానంలో అర్జున్ సర్జాను తీసుకున్నారు. 1999 వ సంవత్సరంలో విడుదలైన ఈ మూవీ తమిళ తెలుగునాట జనాలని పిచ్చెక్కించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించగా.. రఘువరన్ రౌడీగా కనిపించారు. అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ కూడా శ్రోతలను ఆకట్టుకుంటుంది.ఇలాంటి కల్ట్ క్లాసిక్ మూవీని చిరంజీవి చేసుంటే ఎలా ఉండేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: