టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయి లో ఆఫర్లు లేకపోయినా పూజా హెగ్డే కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే భారీ స్థాయి లో ఉంది.రాధేశ్యామ్ ముందు వరకు వరుస విజయాలను సొంతం చేసుకుని గోల్డెన్ లెగ్ గా గుర్తింపును సొంతం చేసుకున్న పూజా హెగ్డే ఇప్పుడు మాత్రం వరుస డిజాస్టర్లతో ఐరన్ లెగ్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే పూజా హెగ్డే ఆత్మహత్యాయత్నం చేసిందంటూ ఉమైర్ సంధు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.సినిమా ఆఫర్లు తగ్గినంత మాత్రాన హీరోయిన్ పూజా హెగ్డేకు చనిపోవాల్సిన కర్మేం పట్టలేదని ఉమైర్ సంధు ఇంతకు మించి దిగజారొద్దని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమైర్ సంధు మీద పలువురు సెలబ్రిటీలు ఫిర్యాదు చేస్తున్నా అతనికి సరైన శిక్ష పడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీలపై గాసిప్స్ పుట్టిస్తూ వాళ్ల వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసేలా ఉమైర్ సంధు పోస్ట్లు చేస్తున్నారు.
తనకు తాను క్రిటిక్ అని చెప్పుకునే ఉమైర్ సంధు ఇప్పటివరకు ఒక్క సినిమా కు కూడా జెన్యూన్ రివ్యూ ఇవ్వలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉమైర్ సంధు సోషల్ మీడియా అకౌంట్ ను బ్యాన్ చేస్తే బాగుంటుందని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆ అభిప్రాయం సోషల్ మీడియా వేదిక గా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.ఉమైర్ సంధు లాంటి క్రిటిక్స్ వల్ల సినిమా ఇండస్ట్రీ పరువు పోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమైర్ సంధు విషయం లో టాలీవుడ్ ఆడియన్స్ కు సైతం కోపం ఉంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను కించపరిచే విధంగా ఉమైర్ సంధు పలు సందర్భా ల్లో పోస్ట్ లు పెట్టిన సంగతి తెలిసిందే. ఉమైర్ సంధు కామెంట్ల విషయం లో పూజా హెగ్డే ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.