ప్రగతి ఆంటీ చేసే సాహసలకి షాక్ అవుతున్న నెటిజన్స్...!!
ఇలా వెయిట్ లిఫ్టింగ్ రంగంలోకి అడుగు పెట్టినటువంటి (Pragathi) ఈమె పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. అందుకే అందుకు తగిన శిక్షణ తీసుకుంటూ పోటీలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదేవిధంగా ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేసిన ప్రగతి రెండు నెలల క్రితం జీవితం పూర్తిగా విభిన్నమైన దారిలో పడుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు.పవర్ లిఫ్టింగ్ లో నా కొత్త ప్రయాణం మొదలైందని తెలిపారు. రెండు నెలల కాలంలోనే జీవితం మొత్తం అయిపోయినట్టుగా ఉంది. మనం కూడా దీనిని సాధించగలమనిపించింది. పవర్ లిఫ్టింగ్ లో తనకు లక్ష్యాలు ఎక్కువగా ఉన్నాయని తన లక్ష్యం సాధించే వరకు ఆగనని తెలిపారు. విజన్ డిసిప్లైన్ పవర్ నేషనల్ 2023` పోటీల్లో తాను పాల్గొంటున్నట్టు తెలియజేస్తూ చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.