విశ్వక్ సేన్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న యంగ్ టాలెంటెడ్ హీరోలలో విశ్వక్సేన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో ఇక ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలదొక్కుకున్నాడు అని చెప్పాలి. దర్శకుడిగా హీరోగా కూడా రాణిస్తూ ప్రస్తుతం సత్తా చాటుతూ ఉన్నాడు. వైవిద్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుసగా సూపర్ హిట్లను సొంతం చేసుకుంటున్నాడు అని చెప్పాలి. దీంతో విశ్వక్సేన్  సినిమా వస్తుందంటే చాలు అందులో ఏదో కొత్తదనం ఉంటుందని తెలుగు ప్రేక్షకులు అందరూ భావించే విధంగా ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు.



 అంతేకాదు తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా మాస్ కా దాస్ గా మారిపోయాడు విశ్వక్సేన్. మొన్నటికి మొన్న దాస్ కా దమ్ కి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్న ఈ యంగ్ హీరో.. ఇక ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్లో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర బృందం కూడా ప్రకటించింది. కాగా విశ్వక్సేన్ సరసన హీరోయిన్గా ఎవరు ఛాన్స్ దక్కించుకున్నారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.


 ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరమీదకి వచ్చాయి. కాగా ఇటీవల విశ్వక్సేన్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న అమ్మాయి ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరినీ హీరోయిన్గా ఎంపిక చేశారట. ఇక త్వరలోనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకి ముళ్ళపూడి రవితేజ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పై రామ్ తోళ్లూరి ఈ సినిమాను రూపొందిస్తూ ఉండడం గమనార్హం. కాగా ఈ సినిమా జేక్స్ విజయ్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: