శ్రీముఖికి లిప్ లాక్ ఇవ్వబోయిన అవినాష్.. చెంప పగిలింది?
అటు మాటీవీలో శ్రీముఖి అవినాష్ చేసే రచ్చ కూడా కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులకు అస్సలు నచ్చదు అని చెప్పాలి. ఎందుకంటే అవినాష్ వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇక కెమెరా ముందు శ్రీముఖితో హగ్గుల తో రెచ్చిపోతూ ఉంటాడు అని చెప్పాలి. మరోసారి ఇలాగే రెచ్చిపోయాడు అవినాష్. ఏకంగా శ్రీముఖికి లిప్ లాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే స్టార్ మా పరివారం ఎంతలా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీరియల్స్ లో నటించే వాళ్ళని గెస్ట్లుగా పిలిచి వారితో సరదాగా రకరకాల గేమ్స్ ఆడిస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటారు.
ఇక ఈవారం ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే కాన్సెప్ట్ తో పాత సీరియల్స్ లో నటించిన జంటలను గెస్టులుగా తీసుకుని వచ్చారు. ఇక వాళ్లతో గేమ్స్ ఆడించారు. అయితే ఇలా వచ్చిన గెస్టులతో గేమ్స్ ఆడించే క్రమంలో శ్రీముఖి ముక్కు అవినాష్ మధ్య ముద్దు సన్నివేశం చోటు చేసుకుంటుంది. అయితే ఈ స్కిట్లో భాగంగా అప్పటి వరకు నార్మల్ గా ఉన్నా అవినాష్ ఒక్కసారిగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి శ్రీముఖికి లిప్ లాక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఈ పరిణామంతో షాక్ అయిన శ్రీముఖి వెంటనే తేరుకుని అవినాష్ గుబ గుయ్యిమనే రీతిలో ఏకంగా చెంప పగలగొట్టింది. దీంతో అవినాష్ షాక్ అవ్వగా.. మిగతా గెస్టులు పగలబడి నవ్వుకున్నారు.