ఆ విషయం నాకెంతో బాధకు గురి చేసింది :: మిల్కీ బ్యూటీ తమన్నా...!!

murali krishna
గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నారు నటి తమన్నా . ‘జీ కర్దా’, ‘లస్ట్‌స్టోరీస్‌ 2’ వంటి ప్రాజెక్టుల్లో ఆమె నటించడంపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌పై తాజాగా తమన్నా స్పందించారు. నెట్టింట్లో తాను ఎదుర్కొంటోన్న విమర్శల గురించి మాట్లాడారు. విమర్శలు తనకు కొత్తేమీ కాదని అన్నారు. 14 ఏళ్ల వయసులోనే కొంతమంది వ్యక్తులు తమ అభిప్రాయాలను తనపై రుద్దాలని చూశారని చెప్పారు.

‘'14 ఏళ్లు ఉన్నప్పుడే నేను పరిశ్రమలోకి అడుగుపెట్టాను. 18 ఏళ్ల ఈ సినీ కెరీర్‌లో ఎన్నో విమర్శలు చూశా. నటిగా తొలి అడుగు వేసే సమయంలో.. ‘‘మీ అమ్మాయిని ఇండస్ట్రీలోకి ఎందుకు పంపుతున్నారు? పరిశ్రమ ఎలా ఉంటుందో తెలుసా?’’ అంటూ ఎంతోమంది తెలిసిన వాళ్లు నా తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఒకవేళ ఆనాడు వాళ్ల మాటలు పట్టించుకుని ఉంటే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఇక, ఇప్పుడు సోషల్‌మీడియా వేదికగా ఎంతోమంది వ్యక్తులు కామెంట్స్‌ చేస్తుంటారు. వాటిని నేను అస్సలు పట్టించుకోను. 2023లో కూడా ఎవరు ఎలా ఉండాలో మీరు ఎలా చెబుతున్నారు?. ముక్కు ముఖం తెలియని కొంతమంది వ్యక్తులు చేసే నెగెటివ్‌ కామెంట్స్‌ను హైలైట్‌ చేస్తూ వార్తలు సృష్టిస్తున్నారు. ఆ ఒక్క విషయమే నన్నెంతో బాధిస్తుంది. వర్క్‌ విషయంలో విమర్శలు చేస్తే నేను తీసుకుంటా. మళ్లీ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటా’’ అని తమన్నా చెప్పారు.

అనంతరం ఆమె తన ప్రియుడు విజయ్‌ వర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘ఒక వ్యక్తిపై ప్రేమ పుట్టడానికి సమయంతో పనిలేదు. అదే మా విషయంలో జరిగింది. విజయ్‌ అద్భుతమైన నటుడు. అతని వర్క్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనకు నేనొక అభిమానిని. వెబ్‌ సిరీస్‌ షూట్‌లోనే అతడితో పరిచయం ఏర్పడింది. ఎదుటివ్యక్తి భావాలను విజయ్‌ చక్కగా అర్థం చేసుకుంటాడు. ఎవరినీ జడ్జ్‌ చేయడు. దయ, సహనం చాలా ఎక్కువ. ఆ లక్షణాలు నాకెంతో నచ్చాయి’’ అని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: