వైరల్ గా మారిన ప్రభాస్ షాకింగ్ కామెంట్స్....!!
ఈ సినిమాలో నేనొక సూపర్ హీరో అని మూవీలో నా రోల్ ఫన్నీగా సాగుతుందని ప్రభాస్ వెల్లడించారు. ప్రాజెక్ట్ కే మూవీలో నాగ్ అశ్విన్ నా రోల్ ను డిజైన్ చేసిన విధానం అంటే నాకెంతో ఇష్టమని ప్రభాస్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కే సినిమాలో బలమైన ఎమోషన్స్ ఉంటాయని ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క కమెడియన్ నేనేనని ప్రభాస్ కామెంట్లు చేశారు. ప్రభాస్ సరదాగా చెప్పారో సీరియస్ గా చెప్పారో తెలీదు కానీ ఈ కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ నటులు నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ పరంగా రికార్డులు సృష్టిస్తుండగా కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమా కోసం ప్రభాస్ 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఛార్జ్ చేశారని భోగట్టా. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైందని సమాచారం అందుతోంది.
ప్రాజెక్ట్ కే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక సినిమాగా నిలుస్తుందని ఈ సినిమా రికార్డులు సృష్టించడంలో సందేహాలు అక్కర్లేదని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమాలో పాత్రలు సైతం సరికొత్తగా ఉండనున్నాయని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.