పవన్ కొత్త సినిమా.. నిర్మాతగా స్టార్ హీరో సిస్టర్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు అని చెప్పాలి. అయినా కొన్నాళ్లపాటు రాజకీయాల పై దృష్టి పెట్టి సినిమాలకు దూరమైనప్పటికీ.. పవన్ క్రేజ్ మాత్రం ఇసుమంతైన తగ్గలేదు. అయితే ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ఇక ఇండస్ట్రీలో మరో టాప్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవుతాయి అని ఎంతో ఎంతో మంది సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం పడుతూ ఉంటారు.


 అయితే వీరిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా దేవుడెరుగు.. కనీసం వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క ఫోటో కూడా బయటికి రావట్లేదు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళగా.. వీరిద్దరూ కలుసుకున్నారు. కానీ ఇక సంతాప సభ కావడంతో ఫాన్స్ కూడా పెద్దగా వీరి కలవడాన్ని థ్రిల్ గా ఫీల్ అవ్వలేకపోయారు. అయితే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అటు కలవలేకపోయినప్పటికీ.. ఘట్టమనేని ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది.


 పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమాను ఏకంగా మహేష్ బాబు సోదరి నిర్మించబోతుందట.మహేష్ బాబు అక్క మంజుల త్వరలోనే నిర్మాణ సంస్థను ప్రారంభించబోతుందని తెలుస్తుంది. ఇందిరా క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి ఇప్పటికే సన్నాహాలు కూడా మొదలుపెట్టారట మంజుల. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడట. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఈ సినిమా షూటింగ్ లేదా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో అయినా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కలుసుకునే ఛాన్స్ ఉందని అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: