3000 ఎపిసోడ్స్ తో హిట్ అయిన సీరియల్ కు.. దర్శకుడు సముద్రఖని తెలుసా?

praveen
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు సముద్రఖని.. మొన్నటి వరకు సముద్రఖని అంటే కేవలం నటుడిగా మాత్రమే అందరికీ తెలుసు. ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకి ప్రాణం పోస్తూ ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ ఉంటాడు అని అందరూ భావిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తండ్రుల పాత్రలో నటించటమే కాదు కొన్ని సినిమాల్లో ఏకంగా హీరోలను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ పాత్రలో కూడా నటించి ఆకట్టుకున్నాడు. ఇలా ఏ పాత్ర లో సముద్రఖని నటించిన.. ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందేమో అనేట్లుగా తన నటనతో ప్రభావితం చేశాడు.


 అయితే ఇప్పుడు డైరెక్టర్ అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో బ్రో అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం సినిమాకు ఇది తెలుగు రీమేక్ కావడం గమానార్హం. ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇక ఎన్నో విశేషాలను కూడా చిత్ర బృందం పంచుకుంటున్నారు అని చెప్పాలి.


 అయితే ఇటీవలే ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సాయిధరమ్ తేజ్ డైరెక్టర్ సముద్రకిని గురించి ఎవ్వరికీ తెలియని ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. సముద్రకిని కేవలం సినిమాలకు మాత్రమే కాదు కొన్ని మెగా బ్లాక్ బస్టర్ హిట్ సీరియల్స్ కి కూడా దర్శకత్వం వహించాడట. ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధిక ప్రధాన పాత్రలో నటించిన పిన్ని అనే సీరియల్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ రెండు భాగాలుగా వచ్చింది. సుమారు 3000 ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరించాయి. కాగా మొదటి భాగం పేరు పిన్ని అయితే రెండవ భాగం పేరు ఝాన్సీ. ఇందులో రాధికా ద్విపాత్రాభినయం చేశారు. ఇలా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సీరియల్కు దర్శకత్వం వహించింది సముద్రఖనినేనట . ఈ విషయాన్ని ఇటీవల సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: