స్టార్ హీరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న లయ..!!

Divya
అలనాటి హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్యూట్ హీరోయిన్ గా అచ్చ తెలుగు అమ్మాయిగా మంచి సంపాదించుకున్న లయ అప్పట్లో స్టార్ హీరోలు అందరితో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించింది.. హీరోయిన్గా కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకొని విదేశాలలో ఉన్నలయ సోషల్ మీడియాలో తరచు పలు రకాల వీడియోలను కుటుంబానికి సంబంధించిన వాటిని షేర్ చేస్తూ ఉంటుంది.


లయ ఇన్స్టాగ్రామ్ లో తరచూ యాక్టివ్ గా ఉంటుంది తన కూతురితో కలిసి చేసేటువంటి డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈమధ్య ఇండియా కి వచ్చి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్న లయ తన కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం జరిగింది. తన భర్త డాక్టర్ అని తమకు రెండు మూడు హాస్పిటల్స్ ఉన్నాయ్ అన్నట్లుగా తెలియజేసింది లయ. ఇక అభిమానులు ఏమైనా టాలీవుడ్లో మళ్లీ సినిమాలు ఎప్పుడు చేస్తుందని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


ఇప్పుడు వారి కోరిక నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో చిత్రంలో లయ కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో లయ ను తీసుకోగా తనకు ఈ చిత్రంలో కీలకమైన పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా లయ రీ యంట్రితో నైనా సక్సెస్ అయ్యి మళ్ళీ అభిమానులను అలరిస్తుందేమో చూడాలి మరి. ముఖ్యంగా ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు తో చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: