బ్రో ట్రైలర్ విడుదల.. అదరగొట్టిన పవర్ స్టార్?

Purushottham Vinay
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. తమిళ్ స్టార్ డైరెక్టర్ ఇంకా యాక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా..త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను చాలా  ఆకట్టుకున్నాయి. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరును కూడా పెంచేశారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దేవుడుగా పవన్ కళ్యాణ్ అల్ట్రా స్టైలిష్ లుక్ మాత్రం పవన్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. మార్క్ అలియాస్ మార్కండేయగా సాయి ధరమ్ తేజ్ కనిపించగా.. అతనికి జోడిగా హాట్ బ్యూటీ కేతిక శర్మ నటించింది.ఇక ట్రైలర్ లో మాత్రం మామ అల్లుళ్ళు పవన్- తేజ్ కాంబో మాత్రం అదిరిపోయింది. 



వివిధ గెటప్ లో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు అభిమానులని ఎంతగానో ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ కాలం విలువ తెలిసేలా చెప్పిన ప్రతి డైలాగ్ కూడా ఎంతగానో ఆకట్టుకొంటుంది. ఇక సాయి ధరమ్ తేజ్.. యాక్సిడెంట్ అయిన తరువాత వస్తున్నా రెండవ సినిమా కాబట్టి .. చాలా చోట్ల తేజ్ రియల్ గా ఆ బాధను అనుభవించిన ఫీల్ ఇందులో తెలుస్తోంది. ఇక ఎస్ ఎస్ థమన్ నేపధ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు ఈ మూవీ మేకర్స్. మరి ఈ సినిమాతో మామ అల్లుళ్లు ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.విరుపాక్షా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ మళ్ళీ ఈ సినిమాతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడో లేడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: