ఆ విషయంలో తప్పు చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్...!!
దీనితో మెగాస్టార్ అభిమానులు ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ లేదా థమన్ వంటి సీనియర్ సంగీత దర్శకులను తీసుకోని ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం లేని సంగీత దర్శకుడు పాటలు అందిస్తే ఇలాగే ఉంటుందని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. భోళా శంకర్ సినిమా కి సంగీత దర్శకుడిగా మహతి స్వర సాగర్ ని ఎంపిక చేసుకోవడం అనేది పెద్ద తప్పిదం అయి ఉంటుందని కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు చిత్ర యూనిట్ సభ్యులు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు.. కానీ సినిమా పాటలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోవడంతో ఎంత ప్రమోషన్ చేసినా కూడా వృధా అవుతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. ఇక చిరంజీవి చెల్లెలి పాత్ర స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది..మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.