ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసేది ఆ రోజునే....??
ఇవే కాకుండా ప్రభాస్ ఖాతాలో మరో అందమైన ప్రేమకథ చేరబోతుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ అందమైన ప్రేమకథను తెరకెక్కించేది ఎవరనుకుంటున్నారు.. అతనే డైరెక్టర్ హను రాఘవపూడి. ఇటీవలే సీతారామం తో సూపర్ హిట్ అందుకున్నారు హను. ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ కోసం హను ఓ మంచి లవ్ స్టోరీ సిద్ధం చేసుకున్నారట.
ఇక ఈ స్టోరీని ప్రభాస్ కు చెప్పడంతో ఆయనకు తెగ నచ్చేసిందని.. కథలో కొన్ని మార్పులు చేసి త్వరలోనే ప్రభాస్ కు ఫైనల్ నెరేషన్ ఇవ్వబోతున్నారట. అక్టోబర్ 2 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరి కాంబో ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అలాగే ఈ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. మరీ ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.