బిగ్ బాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సరయు..!

Divya
బుల్లితెర రియాల్టీ షో లలో భారీ పాపులారిటీ దక్కించుకున్న షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు 6 సీజన్లను ఎంతో విజయవంతంగా నడిపించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఇకపోతే ఈ షో కి ఆదరణ ఎంత ఉందో విమర్శలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఇప్పటివరకు చాలామంది ప్రముఖులు ఈ షో పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బయట వాళ్ళు ఈ షోపై నెగటివ్ గా మాట్లాడారు. కానీ ఇందులో పాటిస్పెట్ చేసిన కంటెస్టెంట్లు మాత్రం నెగిటివ్ గా మాట్లాడింది చాలా తక్కువ.. కానీ ఈసారి బిగ్ బాస్ పై సెవెన్ ఆర్ట్స్ సరయు బిగ్ బాస్ లో జరిగే వ్యవహారాలపై మొత్తం బయటపెట్టింది. అదొక ఫేక్ షో అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.

బిగ్బాస్ ఒక అడల్ట్ షో అంటూ ఎంతోమంది మండిపడిన విషయం తెలిసిందే. అయితే అందులో జరిగే దంతా మాత్రం బయట వ్యక్తులకు పెద్దగా అవగాహన ఉండదు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జరిగే వ్యవహారంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. బిగ్బాస్ సీజన్ ఫైవ్, ఓటీటీ సీజన్ 2 సార్లు పాటిస్పేట్ చేసిన సరయు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. బిగ్బాస్ మాత్రమే కాదు రియాల్టీ షో అంటేనే ఒక ఫేక్.
కొనుక్కొని తిరిగే వాళ్లకే డబ్బులు ఇచ్చి, మన అనుకున్న వాళ్ళని ప్రమోట్ చేసి ముందుకు తీసుకొని వెళ్లే షో ఇది. దీనినే రియాల్టీ షో అంటారు. నిన్ను, నన్ను, జనాలందరినీ కూడా పిచ్చోల్లని చేస్తున్నారు. దయచేసి ఇలాంటి షోలు చూడవద్దు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు.. నేను బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాను కాబట్టే చెబుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: