"సూర్య సన్నాఫ్ కృష్ణన్" రీ రిలీజ్ ఆ తేదీనే... అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది..!

Pulgam Srinivas
తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో హీరోగా నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే సూర్య కెరియర్ లో మంచి విజయం సాధించిన మూవీ లలో సూర్య సన్నాఫ్ కృష్ణ సినిమా ఒకటి. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా రాబట్టింది. 
ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో సిమ్రాన్ ... సమీరా రెడ్డి ... దివ్య స్పందన కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ 2008 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఆ సమయంలో మంచి విజయం సాధించిన ఈ మూవీ ని తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.
 


ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 04 తేదీన ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య "కంగువా" అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: