అలా చేశాను అని చిరంజీవి నన్ను తిట్టాడు అంటున్న సీనియర్ నటుడు....!!
ఈ సందర్భం గా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒకసారి షూటింగ్ సెట్ కు వెళ్లాక మధ్యాహ్నం వరకు షూటింగ్ లేదని అన్నారు. అప్పుడు ఎమ్మెస్ నారాయణ ఏంటి అన్నాయ్, ఇంకా చాలా సమయం ఉంది గా అలా బయటకు వెళ్దాం అన్నాడు.అలా ఇద్దరు కలిసి బయటికి వెళ్లి మందు తాగాము. అనుకోకుండా షూటింగ్ కు రమ్మని కబురొచ్చింది.సెట్‌కు వెళ్తే అక్కడ చిరంజీవి ఉన్నాడు. నన్ను చూడగానే నాపై కేకలేశాడు. ఏమయ్యా, బుద్ధుందా? మంచి కెరీర్ ఉన్నవాడివి పట్టపగలు తాగి రావడమేంటి?పది మంది చెప్పుకుంటే ఎంత అసహ్యం గా ఉంటుంది? అని తిట్టాడు. కానీ నా మంచి కోసం, నా బాగోగులు కోరే అతడు నన్ను హెచ్చరించాడు అని చెప్పుకొచ్చాడు కోటా శ్రీనివాసరావు. ఏదేమైనా చిరంజీవి గారికి ఆయన కి ఉన్న సంబంధం గూర్చి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఆయన మెగాస్టార్ తో కలిసి చాలా సినిమాల్లో చేశారు.