కళ్ళ కింద డార్క్ సర్కిల్ పోవాలంటే ఇలా చేయండి..!!
కళ్ళ కింద నల్లటి వలయాలు పూర్తిగా తగ్గించకపోవచ్చు కానీ ఆ డార్క్ స్పాట్లను కొద్దిగా తగ్గించి కళ్లను అందంగా చేసుకోవచ్చు.. కళ్ళ కింద నల్లటి వలయాల పైన చల్లని కీరదోసకాయలు ముక్కలు ముక్కలుగా చేసి కనీసం 15 నిమిషాల పాటు ఉంచడం వల్ల కళ్ళను చల్ల పరుస్తాయి దీనివల్ల కంటి ఉబ్బరం కూడా తగ్గిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
బంగాళదుంపలు లేదా దీని రసం కళ్ళ పైన ఉంచుకున్నట్లు అయితే నల్లటి వలయాలు పైన ఈ రసాన్ని అప్లై చేస్తే నల్లటి వలయాలు తగ్గుతాయట.
టమోటా రసం కొన్ని చుక్కలు తీసుకొని అందులో కాస్త నిమ్మరసాన్ని కలుపుకొని ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్ చుట్టూ అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మకాంతి మెరిసేలా చేస్తాయి.
చిటికెడు పసుపు తీసుకొని అందులోకి పాలు కలుపుకొని పేస్టులాగా తయారు చేసి ఆ పేస్టుని డార్క్ సర్కిల్స్ పైన అప్లై చేసినట్లు అయితే వీటిని తగ్గించవచ్చు.
గ్రీన్ టీ బ్యాగులను వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచిన తరువాత ఆ టీ బ్యాగులను కాసేపు ఫ్రిజ్లో ఉంచి ఆ చల్లటి టీ బ్యాగులను డార్క్ సర్కిల్స్ పైన 15 నిమిషాల పాటు ఉంచితే ఆ డార్క్ సర్కిల్స్ నెమ్మదిగా తగ్గిపోతాయట..