టాలీవుడ్ ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగుతున్న హీరోలు నటించిన సినిమా లలో విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసు కుందాం.
నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.42 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
సాయి రాజేష్ దర్శకత్వం లో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బేబీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఈ మూవీ విడుదల అయిన 9 వ రోజు 2.33 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాహుల్ సంకుర్తియన్ దర్శకత్వంలో రూపొందిన శ్యామ్ సింగరాయ్ మూవీ విడుదల అయిన 9 వ రోజు 1.98 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమా విడుదల అయిన 9 వ రోజు 1.84 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
శర్వానంద్ హీరోగా రూపొందిన శతమానం భవతి సినిమా విడుదల అయిన 9 వ రోజు 1.78 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.