గుంటూరు కారం సినిమా వచ్చేయేడాది విడుదల కావాలి అంటే ఇలా చేయాల్సిందే..?

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తుందా నాలుగవ చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా టైటిల్ ని షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటికి ఎన్నో రోజులు కావస్తున్న ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల పైన ఫోకస్ పెడుతూ ఉండడమే కాకుండా గుంటూరు కారం సినిమాలోని ఒక్కొక్కరిని మారుస్తూ వస్తూ ఉన్నారు త్రివిక్రమ్. దీంతో మహేష్ అభిమానులు చాలా గందరగోళానికి గురవుతున్నారు.


దాదాపుగా గుంటూరు కారం సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటికి చాలా కాలం అవుతోంది .కేవలం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇక హీరోయిన్ల పోస్టర్లను సైతం విడుదల చేశారు తప్ప మరే అప్డేట్ ని కూడా ప్రకటించలేదు.. గుంటూరు కారం సినిమా షూటింగ్ పూర్తి చేయాలి అంటే కచ్చితంగా 90 రోజులపాటు నిరంతరం షూటింగ్ జరగాలి అని పలువురు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు ఇలా చేస్తే కచ్చితంగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం..


అంతేకాకుండా సినిమా షూటింగ్ జరుగుతూ ఉండంగానే ఎడిటింగ్ వర్క్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరగాలి ఇక మహేష్ బాబు కూడా వెకేషన్ వంటి వాటికి వెళ్లకుండా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటే ఈ చిత్రం పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. గుంటూరు కారం సినిమా నుంచి ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ సినిమా అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారా లేకపోతే ఈ సినిమా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయా అనే విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: