"టిల్లు స్క్వేర్" మొదటి సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు గల యువ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి ఈ నటుడు కి భారీ గుర్తింపును తీసుకురాలేదు. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ నటుడు డిజె టిల్లు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ తో రూపొందింది. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. అలాగే ఈ మూవీ లో సిద్దు నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి సూపర్ ప్రశంసలు లభించాయి.
 


అలా ఈ మూవీ తో ఈ నటుడి క్రేజ్ కూడా అమాంతం పెరిగి పోయింది. ఇకపోతే డీజే టిల్లు మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం ఈ నటుడు ఈ మూవీ కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ "టికెట్ ఏ కొనకుండా" అంటూ సాగే ఈ మూవీ మొదటి సాంగ్ ప్రోమో ను విడుదల చేసింది. అలాగే ఈ ఫుల్ సాంగ్ ను జూలై 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: