డాన్స్ మాస్టర్ యష్ ను.. అందుకే హీరోగా పెట్టుకున్నా : దిల్ రాజు

praveen
మొన్నటి వరకు కమెడియన్స్ గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న  వారు ఇక సినిమాల్లో హీరోలుగా అవకాశం వస్తే చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం చేస్తూ ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో కొరియోగ్రాఫర్స్ గా బాగా క్లిక్ అయిన వాళ్ళు సైతం ఇలా హీరోలుగా అవతారం ఎత్తుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ ఒక సినిమాతో నటుడిగా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో యంగ్ కొరియోగ్రాఫర్ కూడా హీరోగా అవతారం ఎత్తాడు.



 ఢీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుని కొరియోగ్రాఫర్ గా అటు ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్న  యష్ ఇక తనదైన డాన్స్ లతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అక్కడక్కడ బుల్లితెర షోస్ లలో కూడా సందడి చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు డాన్స్ మాస్టర్ హీరో అవతారం ఎత్తాడు. ఆకాశం దాటి వస్తావా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. శశి కుమార్ ముతులూరి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుండగా.. సినిమాలో కార్తీక మురళీధరన్ హీరోయిన్గా నటిస్తుంది.


 దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో బలగం తర్వాత హర్షిత్, హన్సిత ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే తన సినిమాలో కొరియోగ్రాఫర్ యష్ను  హీరోగా పెట్టుకోవడం వెనక కారణం ఏంటి అన్న విషయం గురించి చెప్పుకొచ్చాడు. నా సినిమాలో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇస్తానని యష్ తో చెప్పాను. కానీ లుక్ పరంగా అతను బాగున్నాడు. అందుకే హీరోగా పరిచయం చేస్తున్నా. సింగర్ కార్తీక్సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. జీవితంలోని బంధాలను వాటి మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేసే విధంగానే ఈ సినిమా ఉంటుంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: