టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇదివరకే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు అభిమానులని ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇప్పటికీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో చాలా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా విషయంలో ప్రస్తుతం చాలా గందరగోళం జరుగుతుంది. మొదట ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ అని ప్లాన్ చేసి టీం అనౌన్స్ చేసారు.ఇక అది కాస్తా సంక్రాంతికి వాయిదా పడింది. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఈ సినిమా వస్తుందో రాదో అని అయోమయంలో అభిమానులు.ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి ఒక యాక్షన్ సీక్వెన్స్ తీశారు. అది అనుకున్నట్లు రాలేదు అని చెప్పి దానిని ఇంకా యాక్షన్ మాస్టర్స్ ని తీసి ప్రక్కన పెట్టేసారు. కథలో మార్పులు జరగడం ఇంకా పూజ హేగ్దే ను సినిమా నుండి తొలగించడం జరిగింది.
ఇక రీసెంట్ గా ఈ సినిమా DOP PS వినోద్ ని ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని కూడా త్రివిక్రమ్ తీసేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. కానీ వీటిపై మూవీ టీం కూడా ఇంకా అధికారికంగా స్పదించట్లేదు. త్రివిక్రమ్ మహేష్ సినిమా షూటింగ్ కష్టాలు ఇప్పుడు మాత్రమే కాదు, వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా టైములో కూడా చాలా జరిగాయి.ఇప్పుడు గుంటూరు కారం విషయంలో గట్టిగ వినిపిస్తున్న మాట ఏంటి అంటే గురూజీ కథతో ఇంకా తమన్ పాటలతో మహేష్ బాబు హ్యాపీ గా లేరని, కొన్ని చేంజెస్ చెయ్యమని అడిగారట.త్రివిక్రమ్ కూడా పాటల విషయంలో తమన్ పై సీరియస్ అయ్యాడని సమాచారం తెలుస్తుంది.ఏది ఏమైనా కానీ గుంటూరు కారం నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ , గ్లిమ్స్ మాత్రం ఫ్యాన్స్ కి అయితే మంచి కిక్ ఇచ్చాయి. ఈ సినిమా విడుదల అయితే టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.అందుకే చక చక షూటింగ్ జరిగిపోయి సంక్రాంతికి ఈ సినిమా రిలీజైతే తమ అభిమాన హీరోను చూసుకుందామని మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.