సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి బీస్ట్
మూవీ తో
ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న నెల్సన్
దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో మిల్కీ
బ్యూటీ తమన్నా ... రజిని సరసన
హీరోయిన్ గా కనిపించబోతోంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... సన్ పిక్చర్స్ బ్యానర్ వారు ఈ
మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తీ కాగా ప్రస్తుతం ఈ
మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్
జోష్ లో జరుగుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన భారీ ఎత్తున
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా నుండి "కావాలయ్యా" "హుకుం" అంటూ సాగే రెండు పాటలను ఈ
మూవీ మేకర్స్ విడుదల చేశారు.
ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. కాకపోతే ఈ రెండు పాటలకు సంబంధించిన
తమిళ్ వెర్షన్ లను మాత్రమే ఈ
మూవీ మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ
మూవీ లోని మొదటి పాట అయినటువంటి "కావాలయ్యా" అంటూ సాగే పాటకు సంబంధించిన తెలుగు వర్షన్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను
మూవీ మేకర్స్ విడుదల చేశారు. కావాలయ్యా సాంగ్ తెలుగు వర్షన్ సాంగ్ కు సంబంధించిన
ఈవెంట్ ను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ
మూవీ మేకర్స్ "సీఎంఆర్" కాలేజ్
హైదరాబాద్ లో నిర్వహించబోతోంది. ఇందులోనే ఈ సాంగును కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ తెలుగు వర్షన్ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.