రష్మిక ప్రవర్తనతో మళ్ళీ మొదలైన గాసిప్పులు !
ఇలాంటి పరిస్థితుల మధ్య రష్మిక ఈమధ్య లేటెస్ట్ గా ఎయిర్ పోర్ట్ లో ఒక ఓవర్ సైజ్ షర్ట్ వేసుకుని ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడం చాలమంది దృష్టిని ఆకర్షించింది. అయితే ఇలాంటి ఓవర్ సైజ్ షర్ట్ తో ఒకసారి విజయ్ దేవరకొండ కూడ ఇలాగే ఎయిర్ పోర్ట్ లో గతంలో హడావిడి చేశాడు. ఇప్పుడు మళ్ళీ అలాగే రష్మిక ప్రవర్తించడమే కాకుండా ఆమె వేసుకున్న ఓవర్ సైజ్ షర్ట్ గతంలో విజయ్ దేవరకొండ వేసుకున్న షర్ట్ ను పోలి ఉండటంతో రష్మిక వేసుకున్న షర్ట్ విజయ్ దేవరకొండది అంటూ సోషల్ మీడియాలో వార్తల హడావిడి మొదలైంది.
వాస్తవానికి ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మికలు కలిసి సినిమాలలో నటించక పోయినప్పటికీ వారిద్దరూ తరుచూ ఔటింగ్ లకు వెళుతూ రెస్టారెంట్స్ లో టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు అంటూ అనేక రూమర్స్ ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ కెరియర్ అంతంత మాత్రంగా ఉన్న నేపధ్యంలో అతడికి ఒక భారీ హిట్ కావాలి అలాంటి హిట్ ‘ఖుషీ’ మూవీతో ఎంతవరకు వస్తుంది అన్న విషయమై కొన్ని సందేహాలు ఉన్నాయి.
దీనితో తిరిగి రష్మిక విజయ్ దేవరకొండ ల మ్యాజిక్ ను రిపీట్ చేస్తూ ఎవరైనా దర్శకుడు ఒక క్యూట్ లవ్ స్టోరీని వీరిద్దరి పై తీయగలిగితే ఆ మూవీకి విపరీతమైన క్రేజ్ వచ్చే ఆస్కారం ఉంది. మరి అలాంటి ప్రయత్నం ఏ దర్శకుడు ఎప్పుడు చేస్తాడో ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా వీరిద్దరి సాన్నిహిత్యం పై ఇలా గాసిప్పులు వస్తూనే ఉంటాయి.. . .