వరుసగా ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను వసూలు చేసిన మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం విడుదల అయ్యి వరుసగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ వరుసగా 12 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

తాజాగా ఆనంద్ దేవరకొండ ... వీరాజ్ ... వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో రూపొందిన బేబీ సినిమా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 12 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష సినిమా 11 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమా 8 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన దసరా మూవీ 8 రోజుల పాటు వరుసగా ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెలా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: