ప్రభాస్ గురించి క్లారిటీ ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి..!!
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. గతంలో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదలైన రోజు కూడా కాశ్మీర్ ఫైల్స్ సినిమాను విడుదల చేశారని వార్తలు వినిపించాయి.. రాధే శ్యామ్ సినిమా డిజాస్టర్ కావడంతో ది కాశ్మీర్ ఫైల్ సినిమా బాగా జనాలకు నచ్చేసిందని కామెంట్లు కూడా వచ్చాయి.. ఇదంతా ఇలా ఉండగా వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్ అనే ఒక చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది.. ది వ్యాక్సిన్ చిత్రాన్ని కూడా అప్పుడే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ పై పలు రకాల వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది డైరెక్టర్..ఈ వార్తలు రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో వివేక్ అగ్నిహోత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ప్రభాస్ చాలా పెద్ద స్టార్ అని తనది చాలా చిన్న బడ్జెట్ సినిమా అని తెలియజేశారు ప్రభాస్ తో పోటీ పడాలని కోరిక తనకు ఎప్పుడూ లేదని ప్రభాస్ పై తనకు ఎలాంటి ద్వేషం కూడా లేదని ప్రభాస్ మూవీ విడుదల అయ్యే రోజు మా మూవీలు విడుదల కావడం అనేది కో ఇన్సిడెంట్ అన్నట్లుగా తెలియజేశారు. మరి అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు ప్రభాస్‌ని కాదనే విధంగా తెలియజేయడం జరిగింది.