బేబీ మూవీ సంచలనం.. కేజిఎఫ్ 2 రికార్డు బ్రేక్?

praveen
ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలే హవా నడిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో పెద్ద పెద్ద స్టార్ హీరోలు నటించిన కమర్షియల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అట్టర్ ప్లాప్ గా నిలుస్తూ ఉంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ సృష్టిస్తూ వసూళ్లతో సునామీ సృష్టిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి తరహా సినిమాలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి. ఇక ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథతో ప్రేక్షకుల ముందుకు రావాలే గానీ చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధిస్తుంది అని ఎన్నో మూవీస్ నిరూపిస్తున్నాయి అని చెప్పాలి.


 మొన్నటికి మొన్న శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమా కూడా ఇలాంటి సెన్సేషనే సృష్టించింది. కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విజయాన్ని మర్చిపోకముందే ఇటీవల తెలుగు బాక్సాఫీస్ వద్ద బేబీ సినిమా ఇలాంటి సెన్సేషన్స్ సృష్టిస్తుంది అని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా బేబీ ఇక ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది. ఇక యూత్ అందరికీ బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా రెండు వారాలు కావస్తున్న ఇంకా కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.


 ఈ క్రమంలోనే కలెక్షన్స్ విషయంలో ఏకంగా కమర్షియల్ సినిమాల రికార్డులను సైతం బద్దలు కొడుతుంది బేబీ సినిమా. ఈ క్రమంలోనే ఇటీవల కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా వసూళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టింది అని చెప్పాలి  వరుసగా రోజుకి కోటి వసూళ్లు సాధించిన రికార్డు మొన్నటి వరకు కేజిఎఫ్ చాప్టర్ 2 పేరిట ఉండేది  12 రోజుల వరకు వరుసగా ప్రతిరోజు కోటి వసూళ్లు సాధించింది కే జి ఎఫ్ చాప్టర్ 2. ఇక ఇటీవల బేబీ సినిమా 13 రోజులు వరుసగా ప్రతిరోజు కోటి రూపాయలు వసూళ్లు సాధించి రికార్డును బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: