టాలీవుడ్ లో బాలీవుడ్ నటుల హావ పెరగనుందా....??
సీతారామం సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మృణాల్ ఠాకూర్ కు ఊహించని స్థాయి లో డిమాండ్ పెరిగిందనే సంగతి తెలిసిందే. ఈ బ్యూటీకి నిర్మాతలు ఏకంగా 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం ఇస్తున్నారట. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మృణాల్ ఠాకూర్ పారితోషికం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మృణాల్ ఠాకూర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రామ్ పూరీ కాంబినేషన్ మూవీలో సంజయ్ దత్ విలన్ గా ఎంపికైనట్టు భోగట్టా. ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో బాలీవుడ్ హీరోయిన్లు, విలన్లు సత్తా చాటుతుండటం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో బాలీవుడ్ నటుల హవా మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.