'బేబీ' ఎఫెక్ట్.. ఆనంద్ దేవరకొండకి ఇంటికొచ్చి మరీ ఆఫర్స్ ఇస్తున్న స్టార్ డైరెక్టర్స్..?

Anilkumar
భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవుతున్నాయి. పెట్టిన దానికి ఒక్క రూపాయి కూడా ఎక్కువ రావడం లేదు. ఇక ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా తక్కువ బడ్జెట్ తో సాదాసీదాగా రిలీజ్ అయిన చిన్న సినిమాలు మాత్రం కోట్లకు కోట్ల లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఇక అంతేకాకుండా పెట్టిన దానికి ఏకంగా నాలుగైదు రెట్ల లాభాలను తీసుకువస్తున్నాయి. అలాగే ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా బేబీ సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయం తో దూసుకుపోతుందో మనందరికీ తెలిసిందే. 

అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ప్రముఖ యూట్యూబ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్గా నటించింది. కాగా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్ ని సాధిస్తూ ఇప్పటికే 71 కోటికి పైగా వసూళ్లను రాబట్టింది సినిమా. పలు క్రేజీ రికార్డులను సైతం ఈ సినిమా తుక్కు చేసింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిన్ను మొన్నటి వరకు ఈయనతో సినిమా చేయడానికి ఒక్క డైరెక్టర్ కూడా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చి మరి ఇతను సినిమాల కోసం సైన్ చేయించుకుని మరీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఆనంద్ దేవరకొండ తన తదుపరి సినిమాని మారుతీ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే మారుతీ  ఆనంద్ దేవరకొండలకు స్క్రిప్ట్ సైతం వివరించినట్లుగా ఆనంద్ సైతం ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆనంద్ దేవరకొండ ఇంటికి వచ్చి మరి అగ్రిమెంట్ పేపర్ల పై సంతకాలు చేయించుకున్నారట. అయితే ఒకప్పుడు ఆనంద్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ అవకాశాలు ఇవ్వండి అని అడిగిన రోజులు పోయి బేబీ సినిమా తర్వాత డైరెక్టర్లు ఏకంగా ఇంటికి వచ్చి మరి తమ సినిమాల్లో అడుగుతున్నారు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: