మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్న నిహారిక చైతన్య జొన్నలగడ్డతో ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ విషయం నుండి ఇప్పుడిప్పుడే నిహారిక బయటపడుతుంది. నటనకు కొంత కాలం బ్రేక్ ఇచ్చిన నిహారిక డేడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. విడాకుల తర్వాత తాజాగా ఇప్పుడు మళ్ళీ సినిమాలపై ఫోకస్ చేస్తోంది నిహారిక. అందుకోసం పలు వెబ్సైట్లతో పాటు సినిమాలను కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా చైతన్యతో దూరమవుతున్న సమయంలోనే నిహారిక ఈ సిరీస్ ను తీసినప్పటికీ అది అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
దీంతో తాజాగా మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని రెడీ అయ్యిందట నిహారిక. ఇక ఆ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి నిహారిక మొదట సుని ఇండస్ట్రీకి హీరోయిన్ గానే ఇచ్చింది. కానీ హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో ఆమెకి సక్సెస్ దక్కలేదు. తాజాగా మళ్లీ ఇప్పుడు తన టాలెంట్ ని నిరూపించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉందట. అందులో భాగంగానే ఒక యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
వాటికి సంబంధించిన కథను సైతం రెడీ చేశారట. కానీ నిహారిక సినిమాల విషయంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెగా ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదని అంటున్నారు. కానీ నిహారిక మళ్లీ హీరోయిన్గా సినిమాల్లోకి రావడం మెగా కుటుంబానికి ఇష్టం లేదు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. కానీ నిహారిక మాత్రం కుటుంబ సభ్యుల మాట కాదని తనకి నచ్చిన పని అయిన సినిమాల్లోని నటించాలని గట్టిగా నిర్ణయం తీసుకుందట. త్వరలోనే తన కొత్త సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని సైతం ఇవ్వబోతోందనే ప్రచారం కూడా జరుగుతుంది.మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అంత వరకు వేచి చూడాల్సిందే..!!