పవన్ కళ్యాణ్ గత నాలుగు చిత్రాల ఓపెనింగ్స్ కలెక్షన్స్..!!

Divya
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు చిత్రాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా బాగానే పాపులారిటీ సంపాదిస్తున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈనెల 28వ తేదీన బ్రో సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన గత నాలుగు చిత్రాల ఫస్ట్ డే వరల్డ్ వైస్ గా గ్రాస్ కలెక్షన్ల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా.. మొదటి రోజు రూ .49 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి. తర్వాత పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రూ.57 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే రూ.61 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.. అజ్ఞాతవాసి సినిమా విషయానికి వస్తే రూ.61 కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ రోజుbరోజుకి తగ్గిపోతుందని చెప్పవచ్చు.

అజ్ఞాతవాసి సినిమాకి రూ .61 కోట్లు క్రాస్ వసూలు చేయగా బ్రో సినిమాకి రూ .49 కోట్ల రూపాయలు మాత్రమే గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం మాత్రం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి అభిమానులను పెద్దగా మెప్పించలేకపోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా అభిమానులకు విసుకు తెప్పించేలా ఉండడమే కాకుండా తన పార్టీ మద్దతు ఇతర పార్టీలకు ఇవ్వడంతో అభిమానులు తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఒంటరిగానే పోటీ చేయమని సలహాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: