సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్గా రావడానికి అందాల ముద్దుగుమ్మలు ఎంత కష్టపడతారు తెలిసిందే. ఇక అసలు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే ఇంట్లో అసలు ఒప్పుకోరు సినీ ఇండస్ట్రీలో జరిగే పనులు చూసి హీరోయిన్గా తమ పిల్లలను పంపించడానికి తమ తల్లిదండ్రులు ఒప్పుకోరు. అయితే వాళ్ళని ఎదిరించి మరి కొందరి ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్లుగా తమ టాలెంట్ చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ అందం కోసం నానా రకాల తిప్పలు పడుతూ ఉంటారు.
కొందరు కడుపునిండా అన్నం కూడా తినరు మరికొందరు నిద్రపోకుండా కూడా వర్కౌట్స్ చేస్తూ అందర్నీ రెట్టింపు చేసుకుంటారు. ఇక మరికొందరు నాచురల్ పద్ధతి ద్వారా అందంగా కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్లు మాత్రం ప్రస్తుతం అందం కోసం చేస్తున్న పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపును తెచ్చుకున్న త్రిష ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పోనియన్ సెల్వన్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది త్రిష.
దాని తరువాత సరదాగా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ప్రస్తుతం మంచి మంచి సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది త్రిష. కాకపోతే త్రిష కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక 40 ఏళ్లు క్రాస్ చేసిన త్రిష ఇంకా అదే అందం మెరుస్తోంది. అయితే త్రిష అంత అందంగా ఉండడానికి కారణం ఏంటి అని ఆరా తీస్తే కొన్ని సంచలనా నిజాలు బయటపడ్డాయి. త్రిష అందంగా ఉండడానికి కొన్ని రకాల ఇంజక్షన్లు వేయించుకుంటుందని అందుకే ఇంత అందంగా కనిపిస్తుంది అన్న ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు త్రిష అందానికి ముఖ్య కారణం ఇంజక్షన్లు వేసుకోవడమే అని అంటున్నారు. ఆ ఇంజక్షన్స్ వల్లే ఆమె ఇంత అందంగా ఉందట. ఇంజక్షన్స్ వల్ల ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ తరువాత అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్నారు చాలామంది..!!