బేబీ సక్సస్ మీట్ లో చిరంజీవి క్లారిటీ !

Seetha Sailaja
లేటెస్ట్ గా జరిగిన ‘బేబీ’ సక్సస్ మీట్ కు ముఖ్య అతిధిగా చిరంజీవి  రావడం జరిగింది. ఈ సినిమా దర్శకుడు సాయి రాజేష్ నిర్మాత ఎస్ కె ఎన్ చిరంజీవి వీరాభిమానులు కావడంతో ఆ ఫంక్షన్ కు వచ్చిన చిరంజీవి పై విపరీతమైన పొగడ్తల వర్షం కొనసాగింది. తన పై కురిపిస్తున్న పొగడ్తలకు కొంత అసౌకర్యానికి గురైన చిరంజీవి ఒక దశలో  ఆ పొగడ్తలు తట్టుకోలేక ఆ ఫంక్షన్ తన అభినందన సభగా మారిందని జోక్ చేయడంతో చాలమంది నవ్వుకున్నారు.


‘బేబి’ విడుదలకు ముందు తాను ఆసినిమాను చూసి ఆసినిమా క్లైమాక్స్ మరో  విధం గా ఉంటే బాగుంటుంది అంటూ తాను ఇచ్చిన  సలహాను ఆయన బయట పెట్టాడు. "బేబి సినిమా క్లయిమాక్స్ లో నాకు ఓ చిన్న తప్పు కనిపించింది. చివర్లో హీరోయిన్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు దర్శకుడు చూపించాడు. భర్తతో ఉన్నప్పుడు తను బాగానే ఉంది, ఆనంద్ ను చూసినప్పుడు మాత్రం బాధపడుతుంది. దీని వల్ల ఏమైందంటే ఎన్ని తప్పులు చేసినా సరే ఎవడో ఒకడు దొరుకుతాడు వాడితో సెటిల్ అయిపోవచ్చనే భావన ప్రేక్షకులకు కలుగుతుందేమో అనిపించింది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా.. హీరోయిన్ ను నన్ గా లేదా నర్స్ గా చూపిస్తే బాగుండేదని ఉచిత సలహా ఇచ్చాను.’ అంటూ  తాను  ఇచ్చిన  సలహాను  బయటపెట్టాడు.  


అయితే ఆలోచిస్తే  చివరకు దర్శకుడు ఈసినిమా క్లైమాక్స్ విషయంలో తాను తీసుకున్న నిర్ణయం మంచిదే తనకు అనిపించింది అని చెపుతూ చిరంజీవి మాట్లాడుతూ ఏదో తెలియక తప్పు చేసినంత మాత్రాన జీవితం అయిపోయినట్లు కాదని ఆశావాదంతో ఉంటే జీవితం మళ్లీ చిగురిస్తుందనే సందేశాన్ని ‘బేబి’ సినిమాలో దర్శకుడు బాగా ఇచ్చాడు నటు చిరంజీవి చేసిన కామెంట్స్ ఆ ఫంక్షన్ కు హైలిట్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఈ మూవీ హీరోయిన్ వైష్ణవిని సహజ నటి జయసుధతో మెగా స్టార్ చిరంజీవిని పోల్చడం హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: